గోశాల షెడ్నిర్మించాలని ఎంపీకి వినతి

గోశాల షెడ్నిర్మించాలని ఎంపీకి వినతి

నవీపేట్, వెలుగు :  మండలంలోని ఫాకిరాబాద్, కోస్లీ లో గోశాల షెడ్​నిర్మించాలని గోశాల ప్రతినిధులు ఎంపీ అర్వింద్ కు వినతిపత్రం అందజేశారు. బుధవారం బీజేపీ మండలాధ్యక్షుడు ద్యాగ సరిన్ ఆధ్వర్యంలో ఎంపీని కలిశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు, ముంపు బాధితులకు పరిహారం అందేలా కృషి చేయాలని కోరగా, ఎంపీ సానుకూలంగా స్పందించాలని తెలిపారు.  యంచ, మహంతం, కోస్లీ, అభంగపట్నం గ్రామాల అభివృద్ధికి, ఐటీ సెల్ భవనాల ప్రహరీలకు నిధులు మంజూరు మంజూరు చేయాలని ఎంపీని కోరినట్లు పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ఐటీ సెల్ నాయకులు పిల్లి శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి భూషణ్,  రాజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.