
- ఎంపీ అర్వింద్
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో కొనసాగుతున్న ఆర్వోబీ నిర్మాణాలకు నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. బుధవారం కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డితో కలిసి ఇంజినీర్లతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. మాధవ్ నగర్ బ్రిడ్జి రివైజ్డ్ పనులు కలిపి రూ.11.5 కోట్లు, అర్సాపల్లి భూసేకరణకు రూ.10 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు.
మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో స్టేట్ వాటా చాలా వరకు రాలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలుస్తానని తెలిపారు. రైల్వే, నేషనల్ హైవే పనులను సమీక్షించినట్లు ఎంపీ తెలిపారు.