ఎంపీ సాధ్విపై అసదుద్దీన్ విమర్శలు

ఎంపీ సాధ్విపై అసదుద్దీన్ విమర్శలు

బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఆమె కుల అహంకారానికి ఈ మాటలే ఓ నిదర్శనం అని చెప్పారు. సాధ్వి మాటలతో తానేమీ ఆశ్చర్యపోలేదని.. ఆమె ఆలోచన విధానమే అలా ఉంటుందని అన్నారాయన. ఆమె కులాలను కించపరిచారని విమర్శించారు. ఆ పనిని ఎవరు చేయాలో వాళ్లే చేయాలన్నట్టుగా ఆమె క్లియర్ గా చెప్పినట్టుగా అనిపిస్తోందని చెప్పారు అసదుద్దీన్. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ను ఆమె బహిరంగంగానే వ్యతిరేకించిందని అన్నారు ఒవైసీ.

ఎంపీ అయింది టాయిలెట్లు కడగడానికి.. డ్రైనేజీలు నీట్ గా చేయడానికి కాదంటూ ఆమె భోపాల్ నియోజకవర్గంలోని కాలనీవాసులతో అనడం వివాదం రేపింది. సాధ్వి మాటలు బాధ్యతాయుతంగా లేవంటూ పార్టీ నాయకత్వం కూడా ఆమెను మందలిచింది. ఈ సాయంత్రం ఆమె ఢిల్లీలోని పార్టీ ఆఫీస్ లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసి ఈ అంశంపై చర్చించారు.