
మునుగోడులో ఉపఎన్నిక వస్తే టీఆర్ఎస్సే గెలుస్తుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తమకు కావాల్సిన మెజారిటీ ఉందని..ఉప ఎన్నికను కోరుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఉపఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డిని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నల్గొండ జిల్లాలో మునుగోడు ఒక్క స్థానంలోనే టీఆర్ఎస్ లేదని..ఇప్పుడు అక్కడ కూడా టీఆర్ఎస్ పాగా వేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను అయోమాయానికి గురి చేస్తున్నారని లింగయ్య యాదవ్ అన్నారు. ఆయన ప్రజలకు ఆందుబాటులో ఉండరని.. టీఆర్ఎస్ వల్లే మునుగోడు అభివృద్ధి జరిగిందన్నారు. నల్గొండ, మునుగోడు లను ఫ్లోరిన్ రహిత ప్రాంతంగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేసీఆర్ కాలి గూటికి కూడా రాజగోపాల్ రెడ్డి సరిపోడని..కేంద్రమే తెలంగాణ రాష్ట్ర పథకాలను కాపీ కొడుతోందని విమర్శించారు.