
తెలంగాణ అమరులను కనుమరుగు చేసి కేసీఆర్ తన చరిత్రను మాత్రమే ఉండాలని కుట్ర చేస్తున్నారని అన్నారు బీజేపీ నాయకులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ లో తెలంగాణ వైభవ సదస్సులో మాట్లాడిన ఆయన… తెలంగాణ త్యాగధనులను మర్చిపోయి నిజాం సమాధి వద్ద కేసీఆర్ మోకరిల్లారని అన్నారు. బతుకమ్మను పూజించే సంసృతికి… బిన్నంగా బతుకమ్మను డిస్కోపాటగా చేసిన ఘనత ఒక రాజకీయ పార్టీకి చెందుతుందని చెప్పారు.
రజాకర్ల తూటాలకు బలైన అమరుల కుటుంబ సభ్యులు కేసీఆర్ తీరును చూసి సిగ్గుపడుతున్నారని అన్నారు. ఉద్యమసమయంలో సర్ధార్ పటేల్ ఫోటో పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆమహనీయున్ని అవమానపరుస్తుందని తెలిపారు. సెప్టంబర్ 17 ను అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చారని సంజయ్ చెప్పారు.