వృద్ధాశ్రమాల అవసరం రాని రోజులు రావాలి: బండి సంజయ్

వృద్ధాశ్రమాల అవసరం రాని రోజులు రావాలి: బండి సంజయ్

కరీంనగర్ జిల్లా:  తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చితే రాబోయే రోజుల్లో వాళ్లకు కూడా అదే ఆశ్రమంలో సీటు రిజర్వ్ చేసి ఉంటుందన్నారు కరీనంగర్ ఎంపీ బండి సంజయ్.  ఈ నెల 17న జరిగే  ప్రధాన మంత్రి మోడీ జన్మదిన వేడులను పురస్కరించుకుని శుక్రవారం  ఇళ్లందకుంట మండల కేంద్రంలోని శ్రీరామ సాయి మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ లో 30 మంది  వృద్ధులకు దుస్తులు పంపిణి  చేశారు సంజయ్ . ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పిల్లలు ఉండి తల్లిదండ్రులను వృద్ధాశ్రమం, అనాధాశ్రమంలో వేసే మూర్ఖపు సమాజం మారాలని  కోరారు. ఈ ఆశ్రమం కోసం పాటుపడుతున్న ఆశ్రమ నిర్వాహకుల సేవ, ఆలోచన గొప్పది కానీ ఈ ఆశ్రమాల అవసరం రాని రోజులు రావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మోడీ పాలన గురించి ప్రస్తావించిన సంజయ్.. రెండోసారి అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే మోడీ అనేక సంస్కరణలు తెచ్చి ఘనత సాధించారన్నారు. పార్లమెంట్ లో 37 బిల్లులు ప్రవేశ పెట్టి 30 బిల్లులు  పాస్ చేయించారని తెలిపారు. 70 సంవత్సరాలలో పరిష్కారం కాకుండా ఉన్న  370 ఆర్టికల్  సమస్యను 70 గంటల్లో తీర్చారన్నారు. ఈ ఆర్టికల్ రద్దు కోసం అనేక మంది వీర సైనికులు, కాశ్మీర్ ప్రజలు, స్థానికులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆయన తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రజలు కూడా ప్రధాని మోడీ వైపే చూస్తున్నారన్నారు ఎంపీ. గ్రామ స్థాయిలో బీజేపీని బలోపేతం చేసి, దేశ వ్యాప్తంగా కాషాయ వాతావరణం ఏర్పడేలా పార్టీ శ్రేణులు పని చేయాలని సంజయ్ సూచించారు.

MP Bandi Sanjay Distributed cloths to 30 elderly people in a old age home