
రంజాన్ పండగకు ముందు లాక్‌డౌన్ పెడితే.. అసదుద్దీన్ ఓవైసీ క్యాంపు ఆఫీసుకు వచ్చి.. కేసీఆర్‌ను బరిగెలు అందుకొని మరీ కొడతాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఓ పక్క రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం.. మరోపక్క ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహించడంతో రంజాన్ పండుగ అయిపోగానే సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడని ఆయన అన్నారు.
‘ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ అంటే కేసీఆర్ గజగజా వణుకుతాడు. కాబట్టే రంజాన్ తర్వాత లాక్‌డౌన్‌కు ప్లాన్ చేసిండు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తం. ముస్లింలకు అడ్డా అయిన ఓల్డ్‌సిటీలో అసలు కరోనా నిబంధనలే పాటించడం లేదు. అక్కడ ఎవరూ చూసినా మాస్క్ లేకండానే తిరుగుతున్నారు’ అని బండి సంజయ్ అన్నారు.