హైదరాబాద్, వెలుగు: లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జ్, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. అభ్యర్థుల ఎంపిక జరిగినట్టుగా వస్తున్న కథనాలు అవాస్తవమని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి దాకా పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్, ఎన్నికల కమిటీ సమావేశాలు జరగలేదని, ఆ సమావేశాలు పూర్తయ్యాక అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. వ్యక్తి ఆధారిత పార్టీల్లో మాత్రమే అభ్యర్థుల ప్రకటన వెంటనే ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీలో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామయుతంగా జరుగుతుందని పేర్కొన్నారు.
