న్యూఢిల్లీ, వెలుగు: టీచర్లు రెండేళ్లలోపు టెట్‌లో తప్పనిసరిగా పాస్ అవ్వాలని పేర్కొంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. రైట్ టు ఎడ్యుకేషన్ (ఆర్టీఈ) చట్టం– 2009కు సవరణ తీసుకురావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం లోక్ సభలో పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు అకస్మాత్తుగా టెట్ తప్పనిసరనే నియమం పెట్టడంతో లక్షలాది మంది టీచర్లు ఆందోళనలో ఉన్నారని సభ దృష్టికి తెచ్చారు.
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకసార్లు ఉద్యోగం చేసే టీచర్లకు టెట్ నిబంధన విధించబోమని చెప్పారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడేమో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి.. రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని, లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి వైదొగాలని చెప్పడం సరికాదన్నారు.
