జడ్చర్ల చుట్టూ కొత్త బైపాస్ వేయండి .. కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ డీకే. అరుణ వినతి

జడ్చర్ల చుట్టూ కొత్త బైపాస్ వేయండి .. కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ డీకే. అరుణ వినతి

న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హైవే 167– 44ని కలుపుతూ జడ్చర్ల చుట్టూ బై పాస్ రోడ్డు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డిలతో కలిసి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు. 

వాహనాల రద్దీ నేపథ్యంలో జడ్చర్ల పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా బైపాస్ రోడ్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ అరుణ ఒక ప్రకటన విడుదల చేశారు.