రెండేండ్లు ఫామ్ హౌస్ లో ఉండి.. ఇప్పుడొచ్చి నీతులా : ఎంపీ డీకే అరుణ ఫైర్‌‌‌‌‌‌‌‌

రెండేండ్లు ఫామ్ హౌస్ లో ఉండి.. ఇప్పుడొచ్చి నీతులా : ఎంపీ డీకే అరుణ ఫైర్‌‌‌‌‌‌‌‌
  •     కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై ఎంపీ డీకే అరుణ ఫైర్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. సోమవారం జూబ్లీహిల్స్‌‌‌‌లోని తన నివాసంలో మీడియాతో ఆమె మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉండి పాలమూరును గాలికొదిలేసిన కేసీఆర్.. అధికారం పోగానే రెండేండ్లు ఫామ్ హౌస్‌‌‌‌లో కుంభకర్ణుడిలా నిద్రపోయి, ఇప్పుడు గతం మర్చిపోయినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.