బీపీ చెక్ చేసి, మందులు రాసి... ధర్మసాగర్ మండల కేంద్రంలోని మెగా ఉచిత వైద్య శిబిరంలో ఎంపీ కావ్య

బీపీ చెక్ చేసి,  మందులు రాసి... ధర్మసాగర్ మండల కేంద్రంలోని మెగా ఉచిత వైద్య శిబిరంలో ఎంపీ కావ్య

ధర్మసాగర్, వెలుగు : ధర్మసాగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం  కూరపాటి ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.   శిబిరానికి వచ్చిన ప్రజలకు  బీపీ చెక్ చేసి, వైద్య రిపోర్టులను పరిశీలించి, అవసరమైన మందులను అందజేశారు.

ఈ సందర్భంగా  ఆమె  మాట్లాడుతూ.. వైద్యం అనేది వ్యాపారం కాకుండా మానవతా దృక్పథంతో చూడాల్సిన రంగమని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ  కార్యక్రమంలో సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఉప సర్పంచ్ కొమురమ్మ, సాయిపేట సర్పంచ్ లక్ష్మి, కాంగ్రెస్​మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, కూరపాటి ట్రస్ట్ చైర్మన్ కూరపాటి రమేశ్,  డాక్టర్ సుస్మిత  పాల్గొన్నారు.