లోక్ సభ సమావేశాలకు హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

లోక్ సభ సమావేశాలకు హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

లోక్ సభ సమావేశాలకు అటెండయ్యారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మొదటిసారి ఎంపీగా సభకు వెళ్తుండడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో అన్ని వర్గాల ప్రజల ఆంకాక్షలు నెరవేరేందుకు కృషి చేస్తామన్నారు. గత పదేళ్లలో పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు వంశీ. పెద్దపల్లి లోక్ సభ నుంచి తన తాత దివంగత కాకా, తండ్రి వివేక్ ప్రాతినిధ్యం వహించారని.... ఇప్పుడు తనను ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు వంశీ.