ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం : ఎంపీ నగేశ్ 

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం : ఎంపీ నగేశ్ 

ఆదిలాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలైమందని ఎంపీ గొడం నగేశ్ మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

 ఇచ్చిన హామిలు నేరవేర్చాలని ధర్నా

కామారెడ్డి : ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.  ఓబీసీ మోర్చా స్టేట్​ ప్రెసిడెంట్​ఆనంద్​గౌడ్,  పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ నీలం చిన్న రాజు, పార్టీ జిల్లా జనరల్​ సెక్రటరీలు  నరేందర్​రెడ్డి, రవీందర్​రావు, శ్రీకాంత్​ పాల్గొన్నారు.

కక్షపూరితంగా ఇండ్ల కూల్చివేతలు

మంచిర్యాల: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కలెక్టర్ ఆఫీసు ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు  నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీలను అమలు చేయడంలేదని విమర్శించారు. రోడ్డు వెడల్పు పేరుతో అభివృద్ధి ఇష్టా రీతిన ఇళ్లను షాపులను కూల్చివేయడం సరైన పద్ధతి కాదనన్నారు.  బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముఖేశ్ గౌడ్, ఏమాజి, తదితరులు పాల్గొన్నారు.