కార్యకర్త కాలుపై నుంచి దూసుకెళ్లిన కేకే కారు

కార్యకర్త కాలుపై నుంచి దూసుకెళ్లిన కేకే కారు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​కు చెందిన ఓ కార్యకర్త కాలుపై నుంచి ఎంపీ కే. కేశవరావు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాధితుడి  పాదంలో రెండు చోట్ల ఎముకలు విరిగాయి. బుధవారం తెలంగాణ భవన్​లో వరంగల్​లోక్​సభ సన్నద్ధతా సమావేశం నిర్వహించారు. దానికి జయశంకర్​భూపాలపల్లి జిల్లా చెల్పూర్​ గ్రామానికి చెందిన శ్రీనివాస్​ అనే కార్యకర్త అటెండ్ అయ్యాడు.  

మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో  శ్రీనివాస్ బయటకు రాగా.. అదే సమయంలో  కేకే కారు ఆయన కుడి కాలుపై నుంచి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే కేకే తన కారు దిగి గాయపడిన కార్యకర్తను సమీపంలోని ఒమేగా హాస్పిటల్​కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఎక్స్​రే తీసి పాదంలో రెండు ఎముకలు విరిగినట్టుగా నిర్ధారించారు.  సిమెంట్​పట్టీ వేసి బాధితుడిని ఇంటికి  పంపించారు. కారు డ్రైవర్ ​నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది.