తొర్రూరు, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం తొర్రూరు మండలంలోని చెర్లపాలెం, కంఠాయపాలెం గ్రామాల్లో పీఎంజీఎస్‌వై గ్రాంట్స్ రూ.18.36 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ వంతెనలు పూర్తయితే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, నాయకులు మేకల కుమార్, సోమ రాజశేఖర్, విజయ్‌పాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, యాకూబ్‌రెడ్డి, అచ్చిరెడ్డి, సదాకర్, శ్రవణ్, రాజేశ్తదితరులు పాల్గొన్నారు.
