
హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు : వరంగల్ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌తో భేటీ అయ్యారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో కలిసి వరంగల్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు.
పెండింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని, ఇతర రైల్వే సమస్యలపై జీఎంకు వినతిపత్రం అందజేశారు. అలాగే తమ సమస్యలపై అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ సౌత్‌సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పద్మనాభం, శ్రీనివాసులు, లోకేశ్వర్ఎంపీ కావ్యకు వినతి పత్రం ఇచ్చారు.