- కేంద్రానికి ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా 16 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం లోక్ సభలో పబ్లిక్ ఇంపార్టెన్స్ కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. సోషల్ మీడియా వేదికల దుర్వినియోగం దేశవ్యా ప్తంగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
తప్పుడు సమాచార వ్యాప్తి, ఆన్లై న్లో పెరుగుతున్న విషపూరిత వ్యాఖ్యలు, సమాజంలో విభేదాలను పెంచే పరిస్థితులు వంటి అంశాలను సభ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నియంత్రణలు లేకుండా కొన సాగుతున్న డిజిటల్ వేదికలు ప్రజాభిప్రా యాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు నెల కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవా ల్సిన అవసరం ఉందన్నారు.
