దేవుడికి కూడా టోపీ పెట్టే పార్టీ బీజేపీ: ఎంపీ కవిత

దేవుడికి కూడా టోపీ పెట్టే పార్టీ బీజేపీ: ఎంపీ కవిత

జగిత్యాల: బీజేపీ, కాంగ్రెస్ తీరుపై నిజామాబాద్ ఎంపీ కవిత మండిపడ్డారు. దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్, బీజేపీలేనని విమర్శించారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆమె ప్రజలకే కాదు దేవునికి కూడా టోపీ పెట్టే పార్టీ బీజేపి అని విమర్శించారు.  దశాబ్దాలుగా గుడి వివాదం కొనసాగుతోందని..  ఎన్నికలప్పుడు మాత్రమే బీజేపీకి గుడి గుర్తుకువస్తుందని ఆరోపించారు.

గత ఐదేళ్లలో  బీజేపీ ఒకసారి నోట్ల మార్పిడి, మరొకసారి టాక్స్ మార్పు తప్ప చేసిందేమి లేదన్నారు. దేశాన్ని 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ లో… నాడు ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చారనీ.. ఇవాళ ఇందిర మనవడు రాహుల్ కూడా పేదల కోసం ప్రత్యేక  పథకమంటున్నాడంటే కాంగ్రెస్ హయాంలో పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నారు.

19న నిజామాబాద్ జిల్లాలో జరగబోయే ముఖ్యమంత్రి సభకు జనం పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.