వీరజ‌వాన్ మహేశ్‌ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించాలి

వీరజ‌వాన్ మహేశ్‌ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించాలి

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకోవడంలో పోరాడి ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డ ర్యాడా మహేశ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన వీర సైనికుడు ర్యాడా మహేశ్ ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకోవడానికి జరిపిన ఎన్‌కౌంటర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడయ్యాడని కోమటిరెడ్డి కొనియాడారు.

దేశం కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వం అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి.. సైనికులకు మేం అండగా ఉన్నామనే సంకేతాలు పంపాలని కోరారు. మహేశ్ చూపిన దేశభక్తి.. ధైర్యం, తెగువ.. రేపటి తరం కూడా మరిచిపోకుండా ఉండాలంటే అతని స్వగ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు మహేశ్ పేరు పెట్టాలని కోరారు.