
హైదరాబాద్, వెలుగు: తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని, ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, మరో జన్మంటూ ఉంటే కూడా కాంగ్రెస్ లోనే చేరుతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు కూడా బీజేపీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన వెంకట్‌రెడ్డి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు.