
నల్గొండ, వెలుగు: సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లే రోడ్డును వేయకుండా అడ్డుకున్నందుకే వాసాలమర్రి ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ‘ఎర్రవల్లి ఫాంహౌస్‌కు రోడ్డు కోసం వాసాలమర్రి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నవు. వాసాలమర్రిని సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి చేస్తున్నవా?’ అని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సర్కార్ నిధులతో చేపడుతుంటే ఆ ప్రాంత ఎంపీనైన తనకు ఎందుకు ఆహ్వానం పంపలేదని నిలదీశారు. సూర్యా పేటలో మంత్రి కేటీఆర్.. కర్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణకూ తనకు ఆహ్వానం లేదన్నారు. ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను పిలవాలనే సంస్కారం లేని వ్యక్తి సీఎం అవడం మన దౌర్భాగ్యమన్నారు.