
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న దళిత రైతు నర్సింహులు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. స్థానిక నేతలు వర్గల్ మండల కాంగ్రెస్ అద్యక్షుడు నరేందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి,ములుగు మాజీ ఎంపీపీ వెంకట్ రాంరెడ్డి లు ఈ సాయాన్ని నర్సింహులు కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సింహులు కుటుంబానికి అండగా నిలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. తక్షణ సహాయం కింద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరపున నర్సింహులు కుటుంబానికి లక్ష రూపాలు అందించామని చెప్పారు. స్వయంగా ఎంపీ వచ్చి ఆర్ధిక సహాయం అందజేస్తామంటే పోలీసులు అడ్డుకుంటారు.. అరెస్ట్ చేస్తారు.. కాబట్టే తమతోనే ఆర్ధిక సహాయం అందజేయమన్నారని తెలిపారు.
నర్సింహులు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారన్నారు. మూడు ఎకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కోటి రూపాల నష్టపరిహారం అందించాలన్నారు.