కేసీఆర్కు దమ్ముంటే బీసీని సీఎం చేయాలి

కేసీఆర్కు దమ్ముంటే బీసీని సీఎం చేయాలి

జులై 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ సభకు ప్రియాంకగాంధీ హాజరవుతారని..సభలోనే మహిళా డిక్లరేషన్ ను ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశామని..ఈ మీటింగ్లో కీలక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. చేరికల కమిటీలో చర్చించిన తర్వాతే ఎవరినైనా కాంగ్రెస్ లో చేర్పించుకోవాలన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు. తమ కార్యాచరణను ఇప్పుడే ప్రకటిస్తే కేసీఆర్ ఇప్పుడే ఫాంహౌజ్ కు పారిపోతాడని ఎద్దేవా చేశారు. పీఏసీలో చర్చించిన తర్వాత బస్సు యాత్ర కార్యాచరణను ప్రకటిస్తామన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉన్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా..వాటన్నింటిని మర్చిపోవాలన్నారు.


 ధరణి పేరు బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు లాక్కుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రూ. లక్ష రుణమాఫి చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లాండ్ మాఫియా చేస్తూ కోట్లు వెనకేసుకున్నారని విమర్శించారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయనే..కేసీఆర్ బీసీ రుణాలను ప్రకటించారని చెప్పారు.  నియోజకవర్గంలో 50 మందికి బీసీ రుణాలను అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ALSO READ :మంత్రి కేటీఆర్ సమీక్ష.. ఎలక్షన్​ టైం.. నిర్లక్ష్యం వహిస్తే వేటే..

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీలను తిట్టలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని తిట్టిన వారినే ఆయన విమర్శించారని..కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..బీసీలను తిట్టినట్లుగా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ కు దమ్ముంటే బీసీని సీఎం చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని..అందుకే దళితుడైన మల్లికార్జున ఖర్గేను అధ్యక్షుడిని చేసిందని గుర్తు చేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో డీ శ్రీనివాస్ ను పీసీసీ అధ్యక్షుడిని చేసిందన్నారు.