కేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నరు

కేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నరు

యాదాద్రి భువనగిరి: రాష్ట్రానికి ఏం వెలగబెట్టావని దేశ రాజకీయాలు చేస్తానని చెబుతున్నావని సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాలోని రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...  రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని, దళితులకు భూమి , డబుల్ బెడ్రూమ్ వంటి హామీలు ఎన్నో ఇంకా  మిగిలే ఉన్నాయన్నారు.   రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతోంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారని ఆరోపించారు.

 

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అరే...

Posted by Komatireddy Venkat Reddy on Wednesday, June 15, 2022

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధర్మారెడ్డిపల్లి, పిలయిపల్లి కాల్వలకు ఒక్క చుక్క నీళ్లు ఇవ్వలేదన్న ఆయన... కాల్వల పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు.   కొండపోచమ్మ , మల్లన్న సాగర్ ప్రాజెక్టుల వల్ల ముఖ్యమంత్రి పంహౌజ్ లో నీళ్లు అందుతున్నాయని, కానీ తన నియోజకవర్గంలో మూసీ నీళ్లు ఇవ్వడానికి కేసీఆర్ కి మనసు రావడంలేదని మండిపడ్డారు.