కొండా వర్సెస్ ​రంజిత్ .. ఠాణాకెక్కిన చేవెళ్ల పంచాయితీ

కొండా వర్సెస్ ​రంజిత్ .. ఠాణాకెక్కిన చేవెళ్ల పంచాయితీ

 

  • ఎంపీ రంజిత్​రెడ్డి తనపై నోరుపారేసుకున్నారని పోలీసులకు విశ్వేశ్వర్​రెడ్డి ఫిర్యాదు
  • బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్​లో పేర్కొన్న మాజీ ఎంపీ
  • కోర్టు అనుమతితో బంజారాహిల్స్​పీఎస్​లో కేసు నమోదు

హైదరాబాద్‌‌, వెలుగు: బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి వర్సెస్​ఎంపీ రంజిత్​రెడ్డిల చేవెళ్ల పంచాయితీ పోలీస్ ​ఠాణాకెక్కింది. ఎంపీ రంజిత్​రెడ్డి తనకు ఫోన్​చేసి బెదిరించారని విశ్వేశ్వర్​రెడ్డి చేసిన ఫిర్యాదుతో బంజారాహిల్స్​పీఎస్​లో రంజిత్​రెడ్డిపై కేసు నమోదైంది. ఐపీసీ 504 సెక్షన్ కింద పోలీసులు మంగళవారం ఎఫ్‌‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. రంజిత్ రెడ్డి తనను అసభ్యకర పదజాలంతో దూషించాడని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ నెల 20న బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌కు చెందిన కొంత మంది సర్పంచులతో మాట్లాడుతున్నాననే అనుమానంతో రంజిత్ రెడ్డి ఫోన్స్ చేసి వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాల్‌‌ డేటాకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించాడు. విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. కంప్లైంట్ కాపీని కోర్టుకు పంపించారు. కోర్టు సూచనల మేరకు రంజిత్‌‌ రెడ్డిపై బుధవారం ఎఫ్‌‌ఐఆర్ రిజిస్టర్ చేశారు.

సర్పంచ్‌‌లతో మాట్లాడుతున్నారని గొడవ

చేవెళ్లకు చెందిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ సర్పంచులతో కొండా విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారని ఎంపీ రంజిత్‌‌రెడ్డికి సమాచారం అందింది. ఇదే విషయంలో రంజిత్‌‌ రెడ్డి, విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డిల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. గత బుధవారం రంజిత్‌‌రెడ్డి విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డికి కాల్స్‌‌ చేశారు. తమ పార్టీకి చెందిన సర్పంచులతో ఎందుకు మాట్లాడతావని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాట పెరిగినట్లు తెలుస్తున్నది. రంజిత్‌‌రెడ్డిపై విశ్వేశ్వర్‌‌‌‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని, దమ్మూ ధైర్యం ఉంటే తన వాళ్లను తీసుకెళ్లాలని కౌంటర్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వివాదంలో రంజిత్‌‌రెడ్డి తనతో అసభ్యకరంగా మాట్లాడారని కొండా విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.