రోశయ్యను చూసి నేర్చుకోవాలి

రోశయ్యను చూసి నేర్చుకోవాలి

బషీర్ బాగ్, వెలుగు : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక పునాదులు ఇంత పటిష్టంగా ఉన్నాయంటే అందుకు మాజీ ముఖ్యమంత్రి , ఆర్థిక నిపుణుడు కె. రోశయ్య కృషినే అని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గుర్తుచేశారు. రోశయ్య 90వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోశయ్య చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు భావితరాలు రుణపడి ఉంటాయని పేర్కొన్నారు. 

చట్టసభల్లో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలో రోశయ్య వ్యవహార తీరును చూసి నేర్చుకోవాలని సూచించారు. ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు రోశయ్య జీవన సాఫల్య పురస్కారం అందించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త తదితరులు పాల్గొన్నారు.