- ఎంపీ మొకారియా రాంబాయ్
కామారెడ్డిటౌన్, వెలుగు : భారతీయుల ఐక్యతతోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని గుజరాత్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ మొకారియా రాంబాయ్ పేర్కొన్నారు. మంగళవారం సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఐక్యత పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు.
విభిన్న రాజ్యాలుగా ఉన్న భారత దేశానికి ఒక్కటి చేసిన మహనీయుడు సర్ధార్ వల్లబాయ్ పటేల్ అన్నారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, డీఈవో రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్ జనార్దన్, జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
