సీఎం ఠాక్రే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతా

సీఎం ఠాక్రే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతా

మహారాష్ట్ర సీఎం ఠాక్రే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానన్నారు అమరావతి ఎంపీ నవనీత్ రానా. ఠాక్రే హిందూ వ్యతిరేకి కాకపోతే.. ఆయన బహిరంగ సభలో హనుమాన్ చాలీసా పఠించాలని సవాల్ విసిరారు. బీఎంసీ ద్వారా మహారాష్ట్రలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.బెయిల్ వచ్చాక ముంబై నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి కన్నౌట్ లో హనుమాన్ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లారు ఎంపీ నవనీత్ రానా, రవి రానా దంపతులు. గుడిలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సద్బుద్ధి ప్రసాదించాలని పారాయణం చేశారు. 

మరోవైపు మీడియాతో కేసు గురించి మాట్లాడి బెయిల్ షరతులు ఉల్లంఘించారని.. ముంబై కోర్టును ఆశ్రయించారు పోలీసులు. దీంతో రానా దంపతులకు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈనెల 18 లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈనెల 24న ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరు కానున్నారు నవనీత్ రానా. ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమానా చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ రానా దంపతులు వ్యాఖ్యల తర్వతా.. వారిద్దరూ అరెస్టయ్యారు. రాజద్రోహం కేసులో 12 రోజులు జైళ్లో ఉన్న తర్వతా బెయిల్ పై బయటకు వచ్చారు.