
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ఓబీసీలకు కల్పించే రిజర్వేషన్ల న్యాయ పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి.. ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ కుల సర్వే వివరాలు, దాని ఫలితాల ముఖ్యాంశాలను ఆమెకు వివరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో ఓబీసీలకు 42 శాతం కోటా కల్పించాలనే రాష్ట్ర నిర్ణయాన్ని, సంకల్పాన్ని ప్రియాంక గాంధీ అభినందించారన్నారు. ఓబీసీలకు న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో తన పూర్తి మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇచ్చారని వెల్లడించారు