నేపాల్ జెన్ జెడ్ బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా

నేపాల్ జెన్ జెడ్ బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా

నేపాల్​ కొత్త పీఎం సుశీలాకర్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనరేషన్​ జెడ్​ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.  ఒక్కో కుటుంబానికి రూ 10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నారు. దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నిరసనల్లో మరణించిన వారిని అమర వీరులుగా ప్రకటించారు. 

నేపాల్ నిరసనల్లో 72కి చేరిన మృతుల సంఖ్య 

నేపాల్లో సెప్టెంబర్9న చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు మొత్తం71 మంది చనిపోయారు. ప్రధానికి సమర్పించిన అధికారిక రిపోర్టుల ప్రకారం.. చనిపోయిన వారిలో 59 మంది నిరసనకారులు, 10 మంది తప్పించుకున్న ఖైదీలు,ముగ్గురు పోలీసు అధికారులు ఉన్నారు. 

ఆదివారం ఉదయం ఖట్మండులోని భౌదలోని భట్టభటేనీ సూపర్​ మార్కెట్​ లో వెలికితీసిన ఆరు మృతదేహాలతో కలిపి71 మంది చనిపోయారు. గాయపడిన 134 మంది ఆందోళనకారులు, గాయపడిన 57మంది పోలీసు సిబ్బందితో సహా 191 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స తర్వాత ఇప్పటికే వెయ్యి మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. నిరసనలకు సంబంధించి గాయపడిన వారందరికీ ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోంది. 

హింస, దోపిడీపై న్యాయ విచారణ 

సెప్టెంబర్ 9న ఖాట్మండుతో సహా వివిధ జిల్లాల్లో జరిగిన భారీ ఆందోళనలు, దోపిడీలపై ప్రధాన మంత్రి కర్కీ న్యాయ విచారణకు ఆదేశించారు. నిరసనల ముసుగులో ముందస్తు ప్రణాళికతో కూడిన విధ్వంసక చర్యలు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయని ప్రధాని సుశీలా కర్కీ అన్నారు. 

మరిన్ని వార్తలు