బీసీ బిల్లుపై వైఖరేంది?ఎంపీ ఆర్.కృష్ణయ్య

బీసీ బిల్లుపై వైఖరేంది?ఎంపీ ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలగు: సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించడం అభినందనీయమేగానీ..బీసీ బిల్లుపై కూడా బీజేపీ తన వైఖరేంటో స్పష్టం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య పా ల్గొని, మాట్లాడారు. తమ అంతిమ లక్ష్యం చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు సాధించడమేనని తెలిపారు. దానికోసం పోరాడుతూనే ఉంటామని వెల్లడించారు. బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23 సీట్లు, కాంగ్రెస్ 20 సీట్లు కేటాయించి అన్యాయం చేశాయని ఆరోపించారు.