ముషీరాబాద్, వెలుగు: బీసీల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల సబ్సిడీ రుణం ఇవ్వాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. బీసీ ప్రతినిధుల బృందం మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు.
120 బీసీ కాలేజీ హాస్టళ్లు, కొత్తగా 150 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో 20, రంగారెడ్డిలో 10, మేడ్చల్ లో 10, మహబూబ్ నగర్ జిల్లాలో 15, నల్గొండలో 15, వరంగల్ లో 10, నిజామాబాద్లో 10, కరీంనగర్లో 10, ఖమ్మంలో 10, ఆదిలాబాద్లో 10 చొప్పున కొత్త హాస్టళ్లు మంజూరు చేయాలన్నారు.
