ముందుంది అసలు సినిమా.. ఆప్విమర్శలకు ఎంపీ రాఘవ్ చద్దా కౌంటర్

ముందుంది అసలు సినిమా.. ఆప్విమర్శలకు ఎంపీ రాఘవ్ చద్దా కౌంటర్

న్యూఢిల్లీ: పార్లమెంట్‎లో పంజాబ్ సమస్యలను లేవనెత్తలేదన్న సొంత పార్టీ నేతల విమర్శలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా గట్టిగా బదులిచ్చారు. తాను పంజాబ్‏లోని అనేక సమ్యల గురించి రాజ్యసభలో మాట్లాడిన వీడియోలను ఆదివారం ఎక్స్‎లో షేర్ చేశారు. 

నాన్​కానా సాహిబ్ కారిడార్ కోసం, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, భగత్ సింగ్‎కు భారతరత్న ఇవ్వాలని, మహారాజా రంజిత్ సింగ్ రాజసింహాసనం తిరిగి ఇవ్వాలి వంటి పంజాబ్‏కు సంబంధించిన మరెన్నో ముఖ్యమైన అంశాలను చద్దా లేవనెత్తిన అంశాలు ఆ వీడియో ఉన్నాయి. ఈ వీడియోను ఉద్దేశిస్తూ చద్దా ఓ మెస్సేజ్ను పోస్ట్ చేశారు. ‘‘ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. నాకు పంజాబ్ అంటే చర్చనీయాంశం మాత్రమే కాదు. అది నా ఇల్లు. నా ఆత్మ’’ అని అన్నారు.