మెదక్ లో తిరంగ ర్యాలీ

మెదక్ లో తిరంగ ర్యాలీ
  • పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు

మెదక్, వెలుగు: పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం మెదక్ పట్టణంలో గుల్షన్ క్లబ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ  ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ను విమర్శించే మూర్ఖులకు భవిష్యత్​లో ప్రజలే తగిన రీతిలో సమాధానం చెప్తారన్నారు. ఉగ్ర దాడిలో మానవత్వం మరిచి భర్తలను చంపి భార్యల నొదుట సిందూరాన్ని తుడిచిన ముష్కరులకు పీఎం మోదీ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సిందూర్ ఆన్నారు.

మన హైదరాబాద్​లో తయారైన అనేక ఆయుధాలకు కొంతమంది శాస్త్రవేత్తలు మేధస్సును జోడించడంతో జై జవాన్ అంటే జై విజ్ఞాన్ అనే ఒక కొత్త నినాదం వచ్చిందన్నారు. భారత దేశం ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ప్రపంచానికి మన సైన్యం సత్తా ఏంటో చూపించిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, నాయకులు మురళీయాదవ్, సుభాష్ గౌడ్, విజయ్ కుమార్, కాశీనాథ్, రాంచరణ్, శివ, లక్ష్మణ్ పాల్గొన్నారు.