
తూప్రాన్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఎదో ఒక జీవిత బీమాను కలిగి ఉండాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం తూప్రాన్ లోని మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటాయపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్ లో ఏడాదికి రూ.750 కడితే రూ.15 లక్షల ప్రమాద బీమా పొందొచ్చన్నారు. ఆడపిల్లల భవిష్యత్ కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని వినియోగిచుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో1, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో 2వ పోస్ట్ ఆఫీస్ ను ఏర్పాటు చేశామన్నారు. సమస్యల కోసం లీడర్ల సాయం లేకుండా ప్రజలు ఎప్పుడంటే అప్పుడు తనను కలవొచ్చన్నారు.
అనంతరం పోస్ట్ ఆఫీస్ లో తెరిచిన అకౌంట్ పాస్ బుక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అంతకు ముందు గ్రామంలో మాజీ సర్పంచ్ లంబ వెంకటమ్మ ఆధ్వర్యంలో డప్పుచప్పుల్లతో ఎంపీకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రెసిడెంట్ మల్లేశ్, మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ పోచయ్య, మున్సిపల్ ప్రెసిడెంట్ జానకి రాం, లంబ రమేశ్, హరీశ్, నత్తి మల్లేశ్, నర్సోజి, వేణు, విట్టల్, మహేశ్, సిద్దిరాములు, మధుసూదన్, యాదగిరి, మధు, తహసీల్దార్శ్రీనివాస్, ఎంపీడీవో శేషాదరి, ఎస్ఐ శివానందం, పోస్ట్ ఆఫీస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.