బీజేపీకి మరో పేరు ‘పేపర్ చోర్‌‌‌‌‌’: రాహుల్ గాంధీ

బీజేపీకి మరో పేరు ‘పేపర్ చోర్‌‌‌‌‌’: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌‎లో ఇటీవల జరిగిన పేపర్‌‌‌‌‌‌‌‌‌లీక్‌‎కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌ఎంపీ రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. నిరుద్యోగం ‘ఓట్‌‌‌‌‌‌‌చోరీ’తో ముడిపడి ఉందన్నారు. ‘‘బీజేపీకి మరో పేరు పేపర్ చోర్‌‌‌‌.. దేశవ్యాప్తంగా పేపర్‌ లీక్‌‌‌‌‌‌‌‌ఘటనలు జరుగుతున్నాయి. దీని వల్ల లక్షల మంది యువకుల బతుకులు, వారి కలలు, కష్టాన్ని నాశనం చేస్తున్నారు. 

పేపర్‌‌‌‌‌‌‌‌‌‌లీక్‌‌‌‌‌‌‌‌అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను తీసుకురావాలని మేం డిమాండ్ చేస్తున్నాం. కానీ, మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే వారికి పవర్​పై తప్ప నిరుద్యోగుల గురించి పట్టింపులేదు” అని విమర్శించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిరుద్యోగం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువత రోడ్లపైకి వచ్చి ‘పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌చోర్‌, గద్ది ఛోడ్’ అని నినాదాలు చేస్తున్నారని చెప్పారు.