అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

 సుజాతనగర్​/ చుంచుపల్లి.వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పేద వర్గాల సామాజిక గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని, అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు.  గురువారం సుజాతనగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఒక్కరు కూడా ఉండకూడదనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడతలో మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలలో 136 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి మంజూరు పత్రాలను అందజేశామన్నారు.

 అనంతరం చుంచుపల్లి మండలంలోని ధన్బాద్, అంబేద్కర్ నగర్, రాంపూర్ లో రూ.60లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించిన గ్రామ పంచాయితీ ఆఫీసులను ప్రారంభించారు. విద్యానగర్ కాలనీ లో రూ.5.22 కోట్లతో నిర్మించిన భవనంలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో రూ.24లక్షలతో నిర్మించిన జీపీ కార్యాలయం, మీటింగ్ హాల్, అంగన్​వాడీ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. 

కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, సొసైటీ చైర్మన్ హన్మంతరావు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, చీకటి కార్తీక్, సీపీఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.