దీపావళి సెలబ్రేషన్స్లో ట్రాజిడీ.. కార్బైడ్ గన్ వాడి చూపుకోల్పోయిన 14 మంది చిన్నారులు

దీపావళి సెలబ్రేషన్స్లో ట్రాజిడీ.. కార్బైడ్ గన్ వాడి చూపుకోల్పోయిన 14 మంది చిన్నారులు

మధ్యప్రదేశ్‌లో దీపావళి ఉత్సవాలు విషాదంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా పండుగ సందర్భంగా తాత్కాలిక కార్బైడ్ తుపాకులు (Carbide Guns) ఉపయోగించడం వల్ల జరిగిన ప్రమాదాల్లో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనల్లో 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు. 

అక్టోబర్ 22న భోపాల్‌లో జరిగిన ఒక ఘటనలో 8 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలతో సహా 60 మందికి పైగా ముఖం, కళ్లకు గాయాలయ్యాయి.  గత మూడు రోజుల్లో హమీడియా ఆసుపత్రిలో 25 మంది పిల్లలు చేరారు. భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్ నగరాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు నివేదికలు చెబుతుననాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా కంటి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కార్బైడ్ తుపాకులు తయారీలో ఉపయోగించే రసాయనాలతో కళ్ళకు తీవ్రమైన నష్టం కలుగుతుందని డాక్టర్లు హెచ్చరించారు. ప్రజలను ఇలాంటి ప్రమాదకరమైన పరికరాలు ఉపయోగించకుండా ఉండాలని.. పిల్లల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో దీపావళి ఆనందం కాస్త విషాదం మారింది.  ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.