రేప్‌‌‌‌ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నరు: స్వాతి మలివాల్‌‌‌‌

రేప్‌‌‌‌ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నరు: స్వాతి మలివాల్‌‌‌‌

న్యూఢిల్లీ: తనను రేప్‌‌‌‌ చేసి, చంపేస్తా మని ఆగంతుకులు బెదిరిస్తున్నారని ఆప్‌‌‌‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌‌‌‌ చెప్పారు. ఆప్‌‌‌‌ నేతలు, వాలంటీర్లు తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను కించపరుస్తూ చేస్తున్న అసత్య ప్రచారం తర్వాత ఇలాంటి బెదిరింపులు పెరిగాయని చెప్పారు. యూట్యూబర్‌‌‌‌‌‌‌‌ ధృవ్‌‌‌‌ రాథీ తనకు వ్యతిరేకంగా వీడియోను పోస్ట్‌‌‌‌ చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైందని ఆమె తెలిపారు.

ధృవ్‌‌‌‌ రాథీ లాంటి వారు ఆప్ అధికార ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేట ని మండిపడ్డారు. ఆప్‌‌‌‌నకు చెందిన భజన బృందం సభ్యులు తనను అవమానిస్తుండటంతో పాటు భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఆప్‌‌‌‌ పార్టీ నేతలు తనను అవమానించే తీరును చూస్తుంటే మహిళల సమస్యల పట్ల వారి వైఖరి తెలుస్తుందన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై ఢిల్లీ పోలీసు లు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.