
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తొత్తులుగా వాడుకుంటోందని, దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించే అధికారులకే మంచి పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో అక్రమాలకు సహకరించినందుకే రజత్‌కుమార్‌కు ఇరిగేషన్ శాఖలో మంచి పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను సీఎం కేసీఆర్ పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు.