కేటీఆర్ పై వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కేటీఆర్ పై వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం, వెలుగు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ‘బచ్చాగాడు’  అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పొంగులేటి అదే బచ్చాగాడితో స్నేహం చేసిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. 

ఆ బచ్చాగాడే 2023 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాడనే విషయం గుర్తెరగాలన్నారు. గురువారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్​లో స్థానిక కార్పొరేటర్ తోట రామారావు, తోట గోవిందమ్మ దంపతుల ఆధ్వర్యంలో నెలకొల్పిన దసరా అమ్మవారి విగ్రహం వద్ద ఆగమన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. 

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీ రవిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ పై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు భవిష్యత్​లో ప్రజలే సమాధానం చెప్తారన్నారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మున్నూరు కాపు సంఘం నాయకులు ఆకుల గాంధీ, తోట రమేశ్, తోట లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.