
యువత విద్యతో పాటు రాజకీయంగా ఎదగాలన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా ముఖ్యమన్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడ లోని NIMSME ప్రాంగణంలో యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0 రీజినల్ రౌండ్ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వంశీతో పాటు పలువురు వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం భారత భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దుతున్న ఆలోచనాపరులకు స్వాగతం’ అనే థీమ్‌తో జరుగుతుంది.రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో యువత, నిపుణులు, నాయకులు పాల్గొని దేశ అభివృద్ధి, నాయకత్వం, సరికొత్త ఆలోచనలపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.. దేశానికి మన నుంచి ఏదైనా ఇవ్వాలనే ఆలోచించి ఆటమ్ ఎలక్ట్రికల్ బైక్ అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చానని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా చాలా నేర్చుకున్నానని తెలిపారు. పార్లమెంట్ లో చాలా మంది యువ నాయకులు ఉన్నారని అన్నారు. రానున్న రోజుల్లో యువత ఉన్నత విద్యతో పాటు రాజకీయంగా ఎదగాలని సూచించారు.