
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలు పెట్టుబడులకు అనుకూలమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో దుబాయ్ లోని ప్రముఖ పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు ఎంపీ వంశీకృష్ణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు పారిశ్రామిక పెట్టుబడుల కోసం అత్యంత అనుకూలమైన ప్రాంతాలని అన్నారు.
బొగ్గు, విద్యుత్, రైల్వే వంటి మౌలిక వసతులు ఉన్న ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని అన్నారు.
గనులు, ఇన్ఫ్రా స్ట్రక్చర్ విద్యుత్ ఉత్పత్తి, ఫాడ్ ప్రాసెసింగ్, విద్య, హెల్త్ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ వ్యాపార వర్గాలను ఆహ్వానించారు ఎంపీ వంశీకృష్ణ. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులతో సహకారం కొనసాగిస్తామని అన్నారు వంశీకృష్ణ.