పాపం ఆ బుడ్డోడు. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. ఐదేళ్లు నిండటంతో వచ్చే ఏడాది బడికి పంపాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. నాలుగేళ్లు నిండి ఐదో ఏట అడుగెట్టిన వేళ.. పుట్టిన రోజే చనిపోవడంతో ఆ బాలుడి పేరెంట్స్ దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో సాంబార్ లో పడి బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోచోటుచేసుకుంది ఈ ఘటన. మొగిలి మధుకర్-శారద దంపుతులు జగిత్యాల జిల్లా ధర్మారం మల్లాపూర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో పనిచేస్తున్నారు. వంటల పనిలో నిమగ్మమై ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు వాళ్ల కుమారుడు మొగిలి మోక్షిత్ (5) సాంబార్ లో పడి చనిపోయాడు.
బాలుడి బర్త్ డే రోజే డెత్ డే గా మారడం ఆ బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పుట్టినరోజు జరుపుకోవాలని తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడం వారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది.
