దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటాం: ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటాం:  ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

బషీర్ బాగ్, వెలుగు:  పుట్టుకతో, ప్రమాదవశాత్తు  అంగవైకల్యం పొందినవారికి నారాయణ్ సేవా సంస్థాన్  తన ఔదార్యాన్ని చాటుకుంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణలోని  దివ్యాంగులను కూడా కేంద్రప్రభుత్వం ద్వారా అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో కింగ్ కోఠిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల ఏర్పాటు క్యాంప్‌ను ఎంపీ ప్రారంభించి మాట్లాడారు.

ఉదయ్‌పూర్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు పొందిన నారాయణ సేవా సంస్థాన్ దేశవ్యాప్తంగా వికలాంగులకు కృతిమ అవయవాలను ఉచితంగా అందిస్తూ గొప్ప సేవా చేస్తోందని  ప్రశంసించారు. ఇలాంటి సంస్థలకు ప్రోత్సాహించడంతో పాటు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. క్యాంప్ లో 800 మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలను అమర్చారు.