టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తాజాగా ట్రోలర్స్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..డైరెక్టర్ హరీశ్ శంకర్ తన సినిమా అప్‌డేట్‌లను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పాటు అభిమానులకు రిప్లయ్ ఇస్తూ వారికి ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. అయితే,కొన్నిసార్లు ట్వీట్స్ వార్ కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సినిమా వేదికలపై ఎదురయ్యే ప్రశ్నలకు ధీటుగా అదిరిపోయే సమాధానాలు ఇస్తుంటాడు.
ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్(Mr Bachchan) ప్రమోషన్స్లో భాగంగా..ఈ సినిమాలో హీరోహీరోయిన్లపై వస్తోన్న కామెంట్స్కి ఫుల్ స్టాప్ పెట్టాడు. మిస్టర్ బచ్చన్లో నటిస్తున్న రవితేజ, భాగ్య శ్రీ బోర్సే ఏజ్ గ్యాప్ విషయంలో సోషల్ మీడియాలో చాలాకాలంగా ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజకు 56 ఏళ్లు కాగా..హీరోయిన్‍గా భాగ్యశ్రీ ఏజ్ 25 సంవత్సరాలుగా ఉంది. వీరిద్దరి మధ్య దాదాపు 29 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. దీంతో సోషల్ మీడియాలో వస్తోన్న ట్రోలింగ్స్పై డైరెక్టర్ హరీశ్ శంకర్ గట్టిగా బదులిచ్చారు.
తాజాగా హరీశ్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‍పై స్పందిస్తూ.." ఏజ్ గ్యాప్‌పై వస్తున్న వాదనలు ఈ మాత్రం నాకర్థం కావడం లేదు. ఓ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నపుడు..ఆ ఇంట్లో పెద్దలు చాలా విషయాలు చూస్తారు. కేవలం వయస్సు గ్యాప్ ఒక్కటే కాకుండా..పెళ్లి కొడుకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, జాతకంతోపాటు పలు విషయాలను ఆరా తీస్తారు. కానీ సినిమా విషయానికొస్తే..మేం చాలా జాగ్రత్తగా, క్రియేటివ్ గా ఆలోచించాల్సి వస్తుంది.
'సినిమాల్లో ఓ యాక్టర్ ఎప్పుడూ తన వయసు పాత్రలే చేయరు. ఒక్కోసారి 25 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి కూడా 50 ఏళ్లు ఉన్నట్టు ప్రేక్షకుల్ని నమ్మించాలి. అదే యాక్టింగ్. దీన్ని స్క్రీన్ ఏజ్ అంటారు'. అలాగే ఈ సినిమాలో చేస్తున్న హీరోయిన్ ఏజ్ గ్యాప్ గురించి సౌకర్యవంతంగా ఫీలనప్పటికీ.. అలాంటప్పుడు మీకొచ్చిన బాధ ఏంటని ట్రోలర్లను నేరుగా ప్రశ్నించారు.
ALSO READ | GameChanger: గేమ్ ఛేంజర్ క్రేజీ అప్డేట్..మెగా బాణసంచాకు సిద్దమవుతున్న మేకర్స్
ఇలా ఏజ్ విషయంలో మొదలైన ట్రోలర్స్ కి ఉదాహరణకు చెబుతూ..' ధమాఖాలో నటించిన రవితేజ, శ్రీలీల వయస్సు రీత్యా చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఆ టైములో కూడా చాలా ట్రోల్స్ చేశారు. కానీ, ఆ సినిమా రిలీజై ఘన విజయం సాధించింది. దీంతో ట్రోల్స్ ఆగాయి. ఒకవేళ ప్లాప్ అయితే అందుకే డిజాస్టర్ అయిందనేవాళ్ళు అన్నారు.అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా చాలా సినిమాల్లో నటించారు. భారీ బ్లాక్ బస్టర్లను అందించారని హరీష్ గుర్తు చేశాడు. ఏదేమైనా రవితేజ చూడటానికి మాస్ మహారాజ్ లా ఉంటాడు..కాబట్టి ఇలాంటి ఏజ్ గ్యాప్ అనేది గుర్తుకురాడు అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్ట్ 15 న రిలీజ్ కానుంది.