
మృగశిర కార్తె మంగళవారం నుంచి మొదలవుతోంది. నైరుతి రుతుపవనాలు కూడా ప్రవేశించడంతో ఇప్పటికే వాతావరణం చల్లబడింది. రైతులు పొలం పనుల్లో బిజీ కానున్నారు. మృగశిర కార్తె మొదటిరోజును వివిధ ప్రాంతాల్లో మృగశిర, మిరుగు, మిర్గం పేర్లతో పండుగ జరుపుకుంటారు. ప్రత్యేకించి బెల్లంలో ఇంగువను కలుపుకొని మింగుతారు. చేపల కూర వండుకొని తింటారు. సోమవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.