
భద్రాచలం, వెలుగు: భద్రాచలం సబ్‌కలెక్టర్‌గా మృణాల్ శ్రేష్ఠ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్డీవో దామోదర్‌రావు బొకే అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉందన్నారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారుల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు.