
‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఇప్పటికే నానికి జంటగా ఓ సినిమాలో నటిస్తున్న ఆమె.. మరి కొన్ని సౌత్ సినిమాలకు కమిట్ అవుతోంది. మరోవైపు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోంది. వాటిలో ఆదిత్య కపూర్ హీరోగా నటిస్తున్న ‘గుమ్రాహ్’ చిత్రం కూడా ఒకటి. వర్థన్ కేట్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మించింది. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుండగా.. ట్రైలర్‌ను గురువారం లాంచ్ చేశారు.
ఆదిత్య డ్యుయెల్ రోల్ చేయగా.. మృణాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. రీసెంట్ మూవీ ‘సెల్ఫీ’లోని ఓ స్పెషల్ సాంగ్‌లో గ్లామరస్‌గా కనిపించిన మృణాల్.. వెంటనే ఇలా పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ చూసే థ్రిల్లర్ ఇదని, ఇందులో పోలీస్‌గా నటించడం ఫుల్ హ్యాపీ అని చెప్పింది మృణాల్. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’కి ఇది రీమేక్. తెలుగులో ‘రెడ్’గా రీమేక్ అయ్యి ప్లాప్ అయింది. మరి హిందీలో రిజల్ట్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది.